పదోన్నతులు, బదిలీలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, భీమా, నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ బుధవారం సమీక్ష నిర్వహించారు.

Update: 2024-07-17 10:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, భీమా, నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిపై చర్చిస్తామన్నారు. ప్రాజెక్టుల పూర్తికి ఏ చర్యలు తీసుకోవాలో చర్చిస్తామన్నారు. ఇతర ప్రాజెక్టులు పూర్తి చేయడంపై కూడా చర్చించామన్నారు. బడ్జెట్‌లో ఇరిగేషన్ శాఖకు రూ.28వేల కోట్లు కేటాయించాలని కోరతామన్నారు. రూ.8వేల కోట్ల కొత్త ప్రాజెక్టుల పనుల కోసం కేటాయింపు చేసినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. త్వరలోనే ఇరిగేషన్ శాఖలో పదోన్నతులు, బదిలీలు చేపడతామన్నారు.  


Similar News