కార్యకర్తలను కంటికి రెప్పాలా కాపాడుకుంటా: మంత్రి తుమ్మల
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పాలా కాపాడుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన క్షేత్రస్థాయి నాయకులను అన్ని విధాలుగా ఆదుకోవడం తమ కర్తవ్యం అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పాలా కాపాడుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన క్షేత్రస్థాయి నాయకులను అన్ని విధాలుగా ఆదుకోవడం తమ కర్తవ్యం అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సూరంపల్లి రామారావుపై ఇటీవల రాజకీయ ప్రత్యర్థులు దాడులు చేయగా, తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల ఆయనను హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల కోసం రాజకీయ పార్టీలు పనిచేయాల్సి అవసరం ఉన్నదని సూచించారు. పవర్‌లోని లేనోళ్లే దాడులు చేస్తే, అధికారం ఉన్నోళ్లు ఏ స్థాయిలో చేయొచ్చో? ఊహించుకోవాలని హెచ్చరించారు. ఇది మంచి సాంప్రదాయం కాదని, ప్రజశ్రేయస్సు కోసం అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాజకీయ కక్ష్యలతో దాడులు చేస్తే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చట్ట పరంగా నిందితులను శిక్షిస్తామన్నారు.