ఈసారి రాష్ట్రంలో అత్యధిక సాగువుతున్న పంట అదే.. సమీక్షలో మంత్రి తుమ్మల వెల్లడి
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: జూన్ 19వ తేదీ వరకు తెలంగాణలో 17.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్ లోని సచివాలయంలో వానాకాలం సాగుపై గురువారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల సాగు, ఎరువుల నిల్వలు, సరఫరాపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో అత్యధికంగా 15.60 లక్షల ఎకరాల్లో పత్తిసాగు చేస్తున్నారని, 76,600 ఎకరాల్లో కంది పంట సాగు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఖరీఫ్ పంట కాలం ముందుగా ఆరంభమవుతుందని ఆగస్టు వరకు సరిపడా ఎరువులు పంపాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు.