డ్రోన్ టెక్నాలజీ విస్తరణ.. ఈ ఏడాది 500 కొత్త ఉద్యోగాలు : మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ విస్తరణకు కీలక సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో పలు సంస్థల ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబును కలిశారు.

Update: 2025-02-07 12:39 GMT
డ్రోన్ టెక్నాలజీ విస్తరణ.. ఈ ఏడాది 500 కొత్త ఉద్యోగాలు : మంత్రి శ్రీధర్ బాబు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ (Drone technology) విస్తరణకు కీలక సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో సెంటిలియాన్, హెచ్‌పీ రోబోటిక్స్ సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu)ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్తగా 500 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పరిశ్రమలు విస్తరించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి నమ్మకం కలిగించే విధంగా పారిశ్రామిక విధానాలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. 4500 కోట్లు 2016 నుంచి ఐటి పరిశ్రమలకు ప్రభుత్వ సబ్సిడీల బకాయిలు పెండింగులో ఉన్నాయి.. ఒక్కొక్కటిగా ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుందని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News