బీఆర్ఎస్‌లో మిగిలే ఆ నలుగురు ఎవరో మీరే చెప్పాలి.. శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్

తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Update: 2024-07-12 10:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపుల టాపిక్‌‌పై మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌ పార్టీ నేతలకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని మేం ఎవరినీ పిలవలేదని.. కానీ మా పార్టీలోకి ఎవరైనా వస్తామంటే ఎందుకు వద్దంటామని అన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహరంలో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్‌కు చాలా తేడా ఉందన్నారు. గతంలో మా పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి బీఆర్ఎస్ చేర్చుకుంటే.. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పాలన నచ్చి కాంగ్రెస్ పార్టీకి లోకి వస్తున్నారని స్పష్టం చేశారు. ఇక, బీఆర్ఎస్ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలే మిగులుతారని అంటున్నారని, మరీ ఆ పార్టీలో మిగిలే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో ఆ పార్టీ నేతలే చెప్పాలని ఎద్దేవా చేశారు.


Similar News