తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీలు

తెలంగాణలో చిన్నారులు, పేద పిల్లలు, బాలింతలు, గర్బిణీల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిపెడుతోంది.

Update: 2024-10-14 14:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో చిన్నారులు, పేద పిల్లలు, బాలింతలు, గర్బిణీల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిపెడుతోంది. ఈ క్రమంలోనే నాచారం లోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయాన్ని, ఫ్యాక్టరీని మంత్రి సీతక్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతంతో సహా పలు రకాల ఆహార వస్తువులను టీజీ ఫుడ్స్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆహార పదార్థాల నాణ్యతను, పరిసరాల పరిశుభ్రతను మంత్రి సీతక్క చెక్ చేశారు. పౌష్టికాహారంపై సిబ్బందితో పలు విషయాలపై చర్చించారు.

పిల్లలకు సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు అత్యంత నాణ్యతతో ఉండాలని మంత్రి సూచించారు. ఎటువంటి నిర్లక్ష్యం కూడా సహించబోమని, పరిసరాల పరిశుభ్రతతో పాటు, ముడి సరుకుల నుంచి ప్యాకేజింగ్ వరకు ప్రతి దశలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొత్త యూనిట్ల నిర్మాణం పదేళ్లుగా పూర్తి కాలేదని, ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. యంత్రాలను వెంటనే ఇన్‌స్టాల్ చేసి, పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


Similar News