Minister Seethakka : హెల్మెట్ ధరించి స్కూటర్ నడిపిన మంత్రి సీతక్క
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవా(Road Safety Awareness Month Celebrations)ల్లో స్వయంగా హెల్మెట్(Helmet) ధరించి స్కూటర్(Scooter Driven) నడిపారు.
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవా(Road Safety Awareness Month Celebrations)ల్లో స్వయంగా హెల్మెట్(Helmet) ధరించి స్కూటర్(Scooter Driven) నడిపారు. రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మంత్రిగా తన బాధ్యతగా రోడ్డు భద్రత మాసోత్సవాల ప్రచారానికి సొంతంగా రోడ్డు భద్రత నియామాలను అనుసరించి వాహనాన్ని నడిపినట్లుగా సీతక్క వెల్లడించారు.
రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయని, అందుకే వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా వారితో పాటు ఎదుటి వారిని ప్రమాదాలకు దూరంగా ఉంచాలని కోరారు. మత్తు పానీయాలు సేవించడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోడ్డు భద్రత నియమాలను మరింత కఠినంగా అమల చేస్తుందని స్పష్టం చేశారు.