Seethakka:మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. మొబైల్ ఫిష్ వెహికల్స్ ప్రారంభం
భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపేలా అధికారికంగా సావిత్రిబాయి జయంతిని నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: దేశంలో మొదటి సారి సావిత్రి భాయి ఫూలే (Savitribai Phule) జయంతిని అధికారికంగా మహిళా టీచర్స్ డే గా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క (Seethakka) చెప్పారు. బాలికల విద్యా కోసం విశేష కృషి చేసిన సావిత్రీబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తి భవిష్యత్ తరాలకు తెలిలిసేలా తాము కోరిన వెంటనే ముఖ్యమంత్రి జీవో ఇచ్చారన్నారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్ (Praja Bhavan) లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి సీతక్క నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీచర్లకు, మహిళా టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా అధికారికంగానిర్వహించాలని దళిత, బడుగు బలహీన వర్గాల మహిళలు డిమాండ్ చేసినా గత ప్రభుత్వం ఆ గుర్తింపు ఇవ్వలేదన్నారు. గొప్ప కవులు మేధావులైన జయరాజు త్యాగాన్ని గుర్తించి వారు త్యాగాన్ని గౌరవించడంతో పాటు గద్దర్ కు గుర్తింపు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనన్నారు. మహిళా సాధికారత కోసం ఆర్థిక ప్రగతి కోసం, మహిళలను కోటీశ్వరులు చేసేలా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఆడవాల్లకు చదువు అవసరం లేదనే మూఢనమ్మకాల నుంచి ఇప్పడిప్పుడే బయటపడ్డామని, మహిళ ఇంటికే పరిమితం కాదని సావిత్రి భాయి ఫూలే నిరూపించారన్నారు. చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి సావిత్రి భాయి ఫూలే. ఆదివాసీ బిడ్డ రాష్టప్రతి గా ఉన్నారు. భార్యభర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి.. ఇద్దరూ చేయాల్సిందేనన్నారు.
మొబైల్ ఫిష్ వెహికల్స్ ప్రారంభం:
ఇందిరా మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా మహిళా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను (mobile fish vehicles) మంత్రి సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడం మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని నాణ్యత, మంచి రుచి తో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారుచేయాలని మంత్రి సూచించారు. ఈ ఫిష్ ఫుడ్ కు మంచి బ్రాండ్ క్రియేట్ కావాలని 100 సక్సెస్ రేట్ ఉండాలని ఆకాంక్షించారు. అమ్మ చేతి వంటకు మారుపేరుగా ఇందిరా మహిళా క్యాంటీన్ లు ఉండాలన్నారు. సంచార చేపల విక్రయ వాహనాల్లో వ్యాపారాలు విజయవంతం కావడంతో పాటు ఈ వ్యాపారం మండల కేంద్రాల వరకు వెళ్లాలన్నారు.