లిక్కర్ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయ్.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై మంత్రి సీతక్క(Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-09-26 09:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై మంత్రి సీతక్క(Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత్ పథకం(Amrut scheme) అనేది కేంద్ర పథకం అని అన్నారు. అందులో తప్పులు జరిగితే కేంద్ర చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సృజన్ రెడ్డి సీఎం బంధువు అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సృజన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితతో కలిసి వ్యాపారం చేశారని.. లిక్కర్ కేసులోనూ ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలనే కుట్ర పూరితంగా హైడ్రాపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఇటీవల అమృత్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. మోసపూరితంగా రేవంత్ రెడ్డి తన బంధువులకు కాంట్రాక్టులు దక్కేలా చేశారని ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటికే కేటీఆర్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించి సీరియస్ అయ్యారు.


Similar News