పట్టపగలే నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి: మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2023-04-02 13:58 GMT
పట్టపగలే నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి: మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని మండిపడ్డారు. గతంలో పట్టపగలే నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సున్నాలు వేసుకునే రేవంత్ రెడ్డికి ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడ నుండి వచ్చాయని మంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని.. త్వరలోనే దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం రాబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News