వాళ్ల కరెంట్ బిల్లును ప్రభుత్వమే భరిస్తుంది: మంత్రి పొన్నం
లాండ్రీ, ధోబీ ఘాట్‌లు, కటింగ్ షాపులకు విద్యుత్ సరఫరాను డిస్ కనెక్ట్ చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. పెండింగ్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: లాండ్రీ, ధోబీ ఘాట్‌లు, కటింగ్ షాపులకు విద్యుత్ సరఫరాను డిస్ కనెక్ట్ చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. పెండింగ్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు, హెయిర్ కటింగ్ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. వాషర్ మెన్‌లో లబ్ధిదారుల సంఖ్య 76,060 కి 78.55 కోట్లు, నాయి బ్రహ్మణులకు 36,526 మంది బెనిఫియర్లకు రూ.12.34 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆర్థికశాఖకు ప్రపోజల్ పంపించామని, త్వరలోనే నిధులు రిలీజ్ అవుతాయన్నారు. నాయిబ్రహ్మణులు, వాషర్ మెన్‌లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.