మూడు ఫైళ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి సంతకం
సచివాలయంలో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: సచివాలయంలో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన టీఎస్‌ఆర్టీసీ, రవాణా శాఖకు సంబంధించిన మూడు ఫైళ్లపై సంతకం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి బస్‌పాస్‌లకు రాయితీల ఖర్చు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.212.50 కోట్లను విడుదల చేస్తూ తొలి ఫైలుపై సంతకం చేశారు.
2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి రూ.162.50 కోట్లు విడుదల చేస్తూ రెండో ఫైలుపై, ఎల్.రాజ్యలక్ష్మి, హెడ్ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్‌కి లక్ష రూపాయలు మెడికల్ క్లెయిమ్ మంజూరు చేస్తూ మూడో ఫైల్‌పై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వివేక్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, వాణీప్రసాద్, టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.