పార్లమెంట్ ఎన్నికల వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక నిర్ణయం

బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-12 09:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లలో కేంద్రం తెలంగాణను మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చేశారని గొంతెత్తి ప్రశ్నించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని అన్నారు. కరీంనగర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ దీక్షకు దిగనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాలపై ఏప్రిల్ 14న దీక్ష చేపడతానని తెలిపారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎవరెవరికి ఇచ్చారో వారినే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని అన్నారు. తమవైపు ఒక్క వేలు చూపెడితే, తాము నాలుగు వేళ్లు చూపెడతామని చెప్పారు. ఒక్కటి కూడా వదలమని ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ మాట మార్చే ప్రభుత్వం తమది కాదని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీది ఓట్ల రాజకీయం అన్నారు.


Similar News