Minister Ponnam: కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ పై కేసీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బడ్జెట్ లో పస లేదని.. ఇది కేవలం అంకెల గారడీ మాత్రమే అంటూ సెటైర్లు వేశారు.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ పై కేసీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బడ్జెట్ లో పస లేదని.. ఇది కేవలం అంకెల గారడీ మాత్రమే అంటూ సెటైర్లు వేశారు. కాగా బడ్జెట్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పోన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గొర్రెల పంపిణీ పథకం పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం అన్నారు. గత ప్రభుత్వం కేవలం ఒక్క ఫేజ్‌లోనే గొర్రెల పంపిణీ చేసిందని గుర్తు చేశారు. అలాగే 2023 డిసెంబర్ నెలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం 8 నెలల మాత్రమే అని అలాంటి ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు.
అలాగే ఈ నెల 23న కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్.. కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడారని.. ఇక్కడే బీజేపీతో కేసీఆర్ కు ఉన్న దోస్తీ బహిర్గతం అయ్యిందని అన్నారు. అలాగే తెలంగాణ బడ్జెట్ పై కేసీఆర్ విలువైన సూచనలు చేస్తే తీసుకుంటామని.. విమర్శలు చేస్తే సహించమని.. అన్నారు. గత ప్రభుత్వం హయాంలో లక్ష రుణమాఫీ చేయలేని కేసీఆర్ ప్రభుత్వం రైతులకు శత్రువా..? లేక ఒకే దఫాలో రూ. రెండు లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శత్రువా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలంగాణ రైతులకు తెలుసని.. కేసీఆర్ చీల్చి చెండాడితో చూస్తూ మే ఊరుకోమని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.