శ్రమ పడితే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనడానికి రామోజీ రావు నిదర్శనం: మంత్రి పొన్నం
రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ గ్రూప్స్ చైర్మన్ రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించడం జరిగింది.
దిశ, వెబ్‌డెస్క్: రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ గ్రూప్స్ చైర్మన్ రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించడం జరిగింది. శ్రమ పడితే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనడానికి రామోజీ రావు నిదర్శనమని మంత్రి పొన్నం సంతాపం తెలియజేశారు. ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగిన రామోజీ రావు ఆదర్శ నీయుడని కొనియాడారు. వారి మరణం పట్ల తీవ్ర సంతాపన్ని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాబోయే తరానికి మార్గదర్శి రామోజీ రావు గారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షానా కూడా వారి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. వారు పత్రికా రంగంలో, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రాంతీయ జిల్లా వార్తల నుంచి చారిత్రాత్మక వార్తల వరకు మార్గదర్శకమని వెల్లడించారు. శ్రమ పడితే అందుకోలేనిది ఏమి ఉండదని వ్యక్తి రామోజీ రావు కష్టం చూశాకే అర్థమైందన్నారు. తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి వారిని దగ్గరగా ఉండి చూసాను.. వారి జీవితం ఆదర్శమైందని అన్నారు. వారి మరణానికి విచారం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పొన్నం సోషల్ మీడియా వేదికన రాసుకొచ్చారు.