హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: మంత్రి పొంగులేటి
హైడ్రాపై ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
దిశ, వెబ్డెస్క్: హైడ్రాపై ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే హైడ్రాను ప్రారంభించామని, ఆ కోణంలోనే ఆక్రమణలను తొలగించుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. మరో చెన్నై, బెంగళూరు కాకూడదనే హైదరాబాద్లోని చెరువులను ఆక్రమణల నుంచి కాపాడుతున్నామని, అంతేకానీ ఎవనిరీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, హైడ్రా కేవలం అక్రమంగా ఆక్రమించుకున్న లేదా కబ్జాలు చేసి కట్టిన భవనాలను మాత్రమే కూలుస్తోందని మంత్రి తెలిపారు. చివరిగా హైడ్రాకు అందరూ సహకరించాలని, ఆక్రమణలకు పాల్పడినవారే స్వచ్ఛందంగా వదులుకోవాలని కోరారు.
ఇదిలా ఉంటే హైడ్రా కూల్చివేతలను నిలువరించేందుకు ప్రతిపక్షాలు కూడా లీగల్ మార్గాలను వెతుకుతున్నాయి. న్యాయపరంగా హైడ్రాను అడ్డుకోవడానికి ఏమైనా దారులున్నాయేమోనని ప్రయత్నాలు చేస్తున్నాయి.