Minister Ponguleti: కేసీఆర్.. ఆ కలలు కనడం మానెయ్: మంత్రి పొంగులేటి సెటైర్లు

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని, ఇక పైకి లేవడం కష్టమేనని బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) కామెంట్ చేశారు.

Update: 2025-02-20 05:06 GMT
Minister Ponguleti: కేసీఆర్.. ఆ కలలు కనడం మానెయ్: మంత్రి పొంగులేటి సెటైర్లు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని, ఇక పైకి లేవడం కష్టమేనని బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) కామెంట్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) పాలన, సీఎంపై వ్యతిరేకత ఉందని, అధికారులతో పని చేయించుకోవడం చేతకావడం లేదంటూ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ (BRS) కాదని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని, ఎప్పుడు ఎన్నికలు వచ్చి మళ్లీ తమ పార్టీదే అధికారం అని కేసీఆర్ (KCR) ధీమా వ్యక్తం చేశారు.

అయితే, కేసీఆర్ (KCR) చేసిన కామెంట్స్‌పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాక.. పార్టీ ఆఫీస్ ఎలా ఉందో చూడటానికి కేసీఆర్ (KCR) వెళ్లారంటూ సెటైర్లు వేశారు. పాస్‌పోర్ట్ రెన్యువల్ (Passport Renewal) కోసం వచ్చి ముఖం మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని.. ఆ కలలు కనడం మానెయ్యాలని హితవు పలికారు. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) రెండు పార్టీలు ఒక్కటేనని.. అవి రెండు ఒకే లైన్‌లో పని చేస్తున్నాయని అన్నారు. బీజేపీ (BJP) స్టేట్‌మెంట్స్ బీఆర్ఎస్‌ (BRS)కు అనుకూలంగా ఉంటున్నాయని కామెంట్ చేశారు.        

Tags:    

Similar News