ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతకు పూర్తిగా సహకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతకు పూర్తిగా సహకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆహార భద్రత తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రపంచ వరి శిఖరాగ్రసదస్సు హైదరాబాద్ తాజ్ హోటల్ వ్యవసాయ శాఖ మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి ధాన్యం పండించే రైతులకు తమ ప్రభుత్వం విత్తనాలను అందిస్తుందని అలాగే కనీసం మద్దతు ధన కల్పిస్తుందని తెలిపారు. ఈ సీజన్ నుంచి సోనామసూరి పండించే రైతులకు 500 రూపాయల బోనస్ ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 12 మిలియన్ ఎకరాలలో వరి ధాన్యాన్ని పండిస్తున్నారని ఆయన తెలిపారు. ద్వారా 26 మిలియన్ టన్నుల బియ్యం ఉద్యమం తెలిపారు తెలంగాణలో 225 వెరైట రైస్ ను పండిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం నుండి సోనామసూరి, సాంబ మ సూరి, హెచ్ఎంటి ,1010 బాయిల్డ్ , ఐ ఆర్ 64 స్టీమ్ రైస్ వంటి పలు రకాలు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ అమెరికా బంగ్లాదేశ్ యునైటెడ్ లండన్ దేశాలకు ఎగుమతులు ఎక్కువగా అవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సదస్సులో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తో పాటు అంతర్జాతీయ కమిటీ సంస్థ ప్రతినిధులు అంతర్జాతీయ వారి పరిశోధన సంస్థ, భారత దేశ వారి పరిశోధన సంస్థ, చంద్రశేఖర్ ఆజాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్తర్ ప్రదేశ్ తో పాటు భారతదేశ వరి ఎగుమతి దారుల ఫెడరేషన్ వండి సంస్థల ప్రతినిధులతో పాటు 30 దేశాల నుండి వరి ఎగుమతి దిగుమతిదారులు, స్వదేశీ అనుబంధన సంస్థల ప్రతినిధులు అధికారులు శాస్త్రవేత్తలు ఆదర్శ రైతులు పాల్గొన్నారు.