Minister Mallareddy: ఆ విషయం KCR ముందే చెప్పారు.. మరోసారి Mallareddy కీలక వ్యాఖ్యలు
ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
దిశ, వెబ్‌డెస్క్: ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తమపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ఈ విషయం తమకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే చెప్పారని గుర్తుచేశారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదని వ్యాఖ్యానించారు. తమనే కాదు సీఎం కేసీఆర్‌ను కూడా ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఎంతో మంది పేద విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దామని, తామేం అక్రమాలు చేయలేదని అన్నారు. మెడికల్ సీట్లకు వందలకోట్లు డొనేషన్లు వచ్చాయని చెప్పడం అవాస్తమని కొట్టిపారేశారు. ప్రక్రియ అంతా ఆన్లైన్‌లో జరుగుతుండగా అక్రమాలు ఎలా జరుగుతాయని.. అసలు వందలకోట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తనను మానసికంగా క్రుంగ దీయడానికే ఈ వ్యవహారం అంతా నడిపించారని వెల్లడించారు. కొడుకు, కోడలు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పినా వడల్లేదని, మానసికంగా వేధించారని అన్నారు. తనిఖీలు ముగిసినా తమకు వదలరని, ఇవాళ్టి నుంచి విచారణకు రావాలని వేధిస్తారని తెలిపారు. తన కుమారుడితో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నారని ఆవేదన చెందారు. తమ ఇంట్లో రూ.6 లక్షలు దొరికి అక్కడే వదిలేసి వెళ్లారని వ్యాఖ్యానించారు. తమను వేధించిన వారిని వదలమని, ఇంతకింతా తీర్చుకుంటామని అన్నారు. బీఆర్ఎస్‌తో కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నడనే భయంతోనే ఇలా దాడులకు తెగబడుతున్నారని అన్నారు. అయినా భయపడేది లేదని మళ్లీ తామే రాష్ట్రంలో అలవోకగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Also read........
హైదరాబాద్‌కు చేరుకున్న Malla Reddy అల్లుడు.. ఐటీ దాడులపై ఏమన్నారంటే?
ఇంత పెద్ద ఐటీ దాడులు నేనెప్పుడు చూడలేదు: Minister Mallareddy