మొదలైన ఐటీ రైడ్స్.. గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరిన Malla Reddy కొడుకు
టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతి నొప్పి రావడంతో సురారంలోని ఆసుపత్రికి తరలించారు.
దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆయనను సురారంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే నిన్నటి నుంచి ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన టెన్షన్‌కు గురి కావడంతో గుండె నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై మంగళవారం ఉదయం నుంచి 52 ప్రత్యేక బృందాలతో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు (రెండో రోజు) ఉదయం నుంచి మళ్లీ సోదాలు ప్రారంభమయ్యాయి. నిన్న మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కొడుకు మహేందర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు సంతోష్ రెడ్డి ఇంట్లో సోదాలు మొదలయ్యాయి.
Read more:
1.మల్లారెడ్డి ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం...ఐటీ అధికారులతో మల్లారెడ్డి వాగ్వాదం..