వరంగల్‌కు కేటీఆర్.. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించనున్న మంత్రి
ఈ నెల 9న మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 9న మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్ నగరంలో నిర్మించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కళాక్షేత్రాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కళాక్షేత్రం తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిసింది. అమెరికా పర్యటన తర్వాత తొలిజిల్లా పర్యటనకు కేటీఆర్ వెళ్తున్నారు.