కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. ప్రాంతీయ భాషల్లో సీఆర్‌పీఎఫ్ పరీక్షలు రాసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.

Update: 2023-04-15 12:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. ప్రాంతీయ భాషల్లో సీఆర్‌పీఎఫ్ పరీక్షలు రాసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కాగా, వచ్చే ఏడాది నుంచి 13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది.

స్థానిక యువత ప్రమేయాన్ని పెంచే దిశగా కేంద్ర హోంమంత్రి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ప్రకటనలో వెల్లడించింది. దీంతో హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మళయాలం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరీ, కొంకణీ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. కొన్ని రోజుల క్రితమే ఇదే విషయమై మంత్రి కేటీఆర్‌తో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలని కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News