కేసీఆర్, కేటీఆర్ హిట్లర్ తాతయ్యలు.. తండ్రికొడుకులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతలు స్పీడ్ పెంచారు. ప్రచారంలో దూకుడు పెంచి.. ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ కీలక
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతలు స్పీడ్ పెంచారు. ప్రచారంలో దూకుడు పెంచి.. ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. కారు కావాలా.. బేకారు కావాలా అని మంత్రి కేటీఆర్ అహకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని.. కేసీఆర్, మంత్రి కేటీఆర్ హిట్లర్ తాతయ్యలని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.
మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే ప్రచారం చేస్తున్నారని.. మిగిలిన 16 మంది మంత్రులు ఎందుకు ప్రచారం చేయరని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలవొద్దని బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కుట్రలు చేస్తున్నాయని.. కానీ ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో చూసి బీఆర్ఎస్ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యిందని.. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయిన నేతలు పార్టీపై రాళ్లు విసరడం మాములేనని అన్నారు.