ఉన్నదే 10 మంది.. కానీ అందరూ CM అభ్యర్థులే: కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.కాంగ్రెస్‌లో ఉన్నదే 10 మంది.. కానీ అందరూ సీఎం అభ్యర్థులే అని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రం కర్నాటకలో గెలిచారని.. తెలంగాణలో కూడా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని సెటైర్ వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయిందని విమర్శించారు. మేం చేసిన అభివృద్ధిపై ఎంత చెప్పిన కాంగ్రెసోళ్లకు అర్థంకాదని ధ్వజమెత్తారు. చిన్న పిల్లలకు ఎక్కాలు రావు.. కాంగ్రెస్ లీడర్లకు లెక్కలు తెలియవని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో జరిగిన అభివృద్ధి అందరికి కనిపించిన.. కాంగ్రెస్‌కు మాత్రం కనిపించదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలోని గ్రామాలన్నీ కోనసీమల్లా మారాయని అన్నారు. దేశం నలుమూలల నుండి తెలంగాణకు వలసలు వస్తున్నారని.. రివర్స్ మైగ్రేషన్ జరుగుతుందని ఎప్పడైనా ఊహించామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలో మహిళలు నీళ్ల కోసం అష్టకష్టాలు పడేవారని.. ఇక కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాల గురించి ఎంత చెప్పిన తక్కువే అని విమర్శలు గుప్పించారు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు 24 గంటల విద్యుత్ సప్లై చేస్తున్నామన్నారు.
Read More..
శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా: కాంగ్రెస్‌కు మంత్రి KTR సవాల్