కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సోమవారం పోస్టు పెట్టారు.

Update: 2023-04-24 05:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ, అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదానీలపై మంత్రి కేటీఆర్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును అదానీ గ్రూప్‌నకు బదిలీ చేసిన కేంద్రం.. దానిపై ఎలాంటి జీఎస్టీ విధించకపోవడంపై సోమవారం కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘దేశంలో సామాన్య ప్రజలకు పాలు, పెరుగు లాంటి నిత్యావసరాలపై కూడా జీఎస్టీ విధిస్తారు. కానీ, అదానీ లాంటి అసామాన్యులు ఏకంగా ఎయిర్‌పోర్టులు పొందినా ఎలాంటి జీఎస్టీ ఉండదు. ఇలా ఉచితం కాదట. ఎందుకంటే ఇది స్నేహబంధం’ అని కేటీఆర్ సెటైర్లు వేశారు.

Tags:    

Similar News