బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ బహిరంగ సవాల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌‌పై మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-12-20 11:55 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ టార్గెట్‌గా మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇంతకాలం డ్రగ్స్ ఆరోపణలపై స్పందించని కేటీఆర్ ఉన్నట్టుండి అటాక్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోని కేటీఆర్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదుర్కోలేక వేట కుక్కలను వదులుతున్నారని తాము రెడీగా ఉన్నామని వ్యాఖ్యానించారు. మోడీ, గోడీ, ఆయన ఈడీ ఎవరైనా రమ్మను అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్ట్ కోసం వెంట్రుకే కాదు బొచ్చు కూడా పీకి ఇస్తానంటూ ఘాటుగా స్పందించారు. డ్రగ్స్ టెస్టులో తాను తీసుకోలేదని తేలితే కరీంనగర్ చౌరస్తాలో బండి సంజయ్ తన చెప్పుతో తానే కొట్టుకోవాలని అన్నారు. నేను శాంపిల్స్ ఇస్తా మోడీని ఇవ్వాలని కోరుతాను, కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా అంటూ ప్రశ్నించారు. తెలివి ఉందా? బండి సంజయ్ మనిషేనా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో కలకలం లేచింది.

Read more:

మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై స్పందించిన బండి సంజయ్

Full View



Similar News