‘మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే.. ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు’
తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంపర్ మెజార్టీతో గెలవడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. ఈ విషయం రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు కూడా తెలుసని అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకుంటారని తాను అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని టీ హబ్‌లో ఐటీశాఖ 9వ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2013-14లో హైదరాబాద్‌లో ఐటీ ఉత్పత్తులు రూ. 56 వేలు కోట్లు ఉంటే.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఒక లక్ష 83 వేల కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ సెక్టార్‌లో 3 లక్షల 20 వేల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు 7 లక్షలకు పైచిలుకు ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. ఐటీ రంగంలో బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని చెప్పారు. వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సిద్దిపేట, సిరిసిల్ల వంటి పట్టణాలకు కొత్త సంస్థలు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read: దేశాభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి