మరో కొత్త వెబ్ సైట్ ప్రారంభించిన KTR.. ఎన్నికల వేళ కీలక నిర్ణయం..!
నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల కల్పనపై వస్తున్న ప్రశ్నల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గత తొమ్మిదిన్నరేళ్లలో కల్పించిన
దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల కల్పనపై వస్తున్న ప్రశ్నల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గత తొమ్మిదిన్నరేళ్లలో కల్పించిన ఉద్యోగాలకు సంబంధించిన వెబ్ సైట్‌ను మంగళవారం కేటీఆర్ ప్రారంభించారు. లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కన్నా రెట్టింపుకు పైగా ఉద్యోగాలను కల్పించామని తెలిపారు. 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను తొమ్మిదిన్నరేళ్లలో గుర్తించి, లక్షా అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తి చేశామన్నారు. జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి, యువతీయువకులు www.telanganajobstats.in లో ఈ వెబ్సైట్ని సందర్శించి వివరాలు తెలుసుకోవాలని కోరారు.