హైదరాబాద్ వాసులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్

భాగ్యనగరం సిగలో మరో మణిహారం చేరబోతోంది. ట్రాఫిక్‌తో నిత్యం రద్దీగా అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్‌లో పాదాచారుల భద్రతకు శాశ్వత భరోసా కల్పిస్తూ ప్రభుత్వం

Update: 2023-04-26 12:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భాగ్యనగరం సిగలో మరో మణిహారం చేరబోతోంది. ట్రాఫిక్‌తో నిత్యం రద్దీగా అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్‌లో పాదాచారుల భద్రతకు శాశ్వత భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ఆధునిక హంగులతో నిర్మిస్తున్న స్కైవాక్ ప్రారంభానికి రెడీ అయింది. ఈ మేరకు ఈ స్కైవాక్ ప్రారంభోత్సవంపై మంత్రి కేటీఆర్ బుధవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. పాదచారుల భద్రత కోసం రూ.25 కోట్ల వ్యయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్కైవాక్ నిర్మించిందని పేర్కొన్నారు. త్వరలో దీనిని ప్రారంభించబోతున్నట్లు వెల్లడిస్తూ స్కై వాక్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. కాగా ఈ స్కైవాక్ మొత్తం పొడవు 640 మీటర్లు కాగా వెడల్పు-వర్టికల్ వెడల్పు 3,4,6 మీటర్లు, ఎత్తు ఆరు మీటర్లు. లిఫ్ట్, ఎస్కలేటర్స్ మెట్ల సౌకర్యంతో దీనిని నిర్మిస్తున్నారు. మొత్తం ఆరు చోట్ల ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్స్ ఉండేలా దీనిని డిజైన్ చేశారు. 

Tags:    

Similar News