దళిత బంధులో అక్రమాలు ఏందీ..? ఈడీలు ఏం చేస్తున్నారు?
దళిత బంధు స్కీమ్ లో అక్రమాలు జరుగుతున్నాయని స్వయంగా మంత్రి కొప్పుల ఈశ్వర్పేర్కొన్నారు. వెంటనే వాటిని అరికట్టాల్సిన అవసరం ఉన్నదని మంత్రి అధికారులను ఆదేశించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : దళిత బంధు స్కీమ్ లో అక్రమాలు జరుగుతున్నాయని స్వయంగా మంత్రి కొప్పుల ఈశ్వర్పేర్కొన్నారు. వెంటనే వాటిని అరికట్టాల్సిన అవసరం ఉన్నదని మంత్రి అధికారులను ఆదేశించారు. దళిత బంధుపై ఆయన డీఎస్ఎస్భవన్లో మంగళవారం అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..దళిత బంధు స్కీమ్ లో కమీషన్లు తీసుకుంటుంటే ఈడీలు ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. ప్రజల నుంచి కంటిన్యూగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని అరికట్టకపోతే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో గ్రౌండ్ లెవల్ లో తిరిగి పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
ముఖ్యంగాఎస్సీ కార్పొరేషన్ ఈడీలు ఫీల్డ్ లో తిరగాలని, లబ్ధిదారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.లబ్ధిదారులకు అందించిన ప్రతీ యూనిట్పక్కగా నడిచేలా అధికారులు చొరవ చూపాలన్నారు. లబ్ధిదారులకు ప్రతి నెల ఎంత ఆదాయం వస్తుందో? తెలుసుకోవాలన్నారు. దళిత బంధులో అమలు చేస్తున్న కొన్ని యూనిట్లు అద్భుతంగా ఉన్నాయని, కొత్త యూనిట్ల మంజూరు పై ఆలోచించాలన్నారు. ఇప్పటి వరకు దళిత బంధు స్కీమ్ లో సక్సెస్అయిన యూనిట్లపై ఫోకస్పెంచాలన్నారు. ఆవులను, బర్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు వాటి పెంపకంపై ఎప్పటికప్పుడు పశు వైద్యుల తో వాటి ఆరోగ్యం పై సలహాలు సూచనలు చేయాలన్నారు.బర్లకు దానతో పాటు పోషకాలు ఇచ్చే ఆహారం అందించే దిశగా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. మరోసారి దళిత బంధు యూనిట్లలో అక్రమాలు జరుగుతున్నాయని? ఫిర్యాదులు వస్తే పరిస్థితి సీరియస్గా ఉంటుందని మంత్రి అధికారులను హెచ్చరించారు.