Minister: బాగా పనిచేస్తున్నారు.. ఇలాగే కంటిన్యూ చేయండి
ఎండోమెంట్ శాఖ(Endowments Department) ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది బాగా పని చేస్తున్నారని మంత్రి సురేఖ(Minister Konda Surekha) ప్రశంసించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎండోమెంట్ శాఖ(Endowments Department) ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది బాగా పని చేస్తున్నారని మంత్రి సురేఖ(Minister Konda Surekha) ప్రశంసించారు. ఇటీవల తాను చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన నేపథ్యంలో ఆయనను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు పరామర్శించేందుకు వెళితే ఆయన తండ్రి, పెద్దాయన సౌందర్ రాజన్ స్వయంగా తనకు ఈ విషయం చెప్పారని మీటింగులో గుర్తుచేశారు. తన నాయకత్వంలో రాష్ట్రంలో ఎండోమెంట్ శాఖ సమర్థవంతంగా పని చేస్తున్నట్టు కితాబు ఇచ్చినట్టు మంత్రి సమీక్షా సమావేశంలో అధికారులకు వివరించారు. ఆ పెద్దాయన ఇచ్చిన కితాబు తనకెంతో సంతోషం ఇచ్చిందని అన్నారు. శాఖ ఉన్నతాధికారులుగా మీరంతా పని చేస్తేనే ఈ పేరు వచ్చిందని సురేఖ స్పష్టం చేశారు. భవిష్యత్ లో కూడా ఇదే విధంగా పని చేయాలని సూచించారు.
మన పని మనం చేసుకుంటూ పోతే... గుర్తింపు అదే వస్తుందని చెప్పారు. గుర్తింపు కోసం ప్రత్యేకంగా పని చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం శివరాత్రి సందర్భంగా ప్రతి ఈవో, ఉన్నతాధికారులు కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. బాగా పని చేసిన అధికారులను గుర్తించి తగు ప్రోత్సాహాకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఆర్జేసీ రామకృష్ణ, హైదరాబాద్ డీసీ కృష్ణ ప్రసాద్, వరంగల్ డిసి సంధ్యరాణి, జిల్లా అసిస్టెంట్ కమిషర్లు, అన్ని ప్రముఖ శివాలయాల ఈవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.