మంత్రి కోమటిరెడ్డి కాళ్లు మొక్కిన అద్దంకి దయాకర్.. వీడియో వైరల్..!

టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ హీరోగా నటించిన లేటేస్ట్ చిత్రం ‘ఇండియా ఫైల్స్’. ఇటీవల హైదరాబాద్‌లో ఈ మూవీ ఆడియో రిలీజ్

Update: 2024-07-13 11:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ హీరోగా నటించిన లేటేస్ట్ చిత్రం ‘ఇండియా ఫైల్స్’. ఇటీవల హైదరాబాద్‌లో ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు కాంగ్రెస్ కీలక నేత, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ అద్దంకి దయాకర్‌పై ప్రశంసలు కురిపించాడు. అన్ని విషయాలపై అహగాహన ఉన్న నాయకుడు అద్దంకి దయాకర్ అని కొనియాడారు. దురదృష్టవశాత్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకాశం దక్కలేదని.. కానీ ఆయన భవిష్యత్‌లో పెద్ద లీడర్ అవుతాడని ప్రశసించాడు. ఈ క్రమంలో అద్దంకి దయాకర్ మంత్రి కోమటిరెడ్డి కాళ్లకు నమస్కరించారు.

ఈ సీన్ ఆ ఆడియో ఫంక్షన్ మొత్తంలో హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అద్దంకి దయాకర్ పరుష పదజాలంతో తిట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో టీ-కాంగ్రెస్‌లో పెను దుమారమే రేపగా దయాకర్ తరుఫున కోమటిరెడ్డికి స్వయంగా రేవంత్ రెడ్డి స్వారీ చెప్పారు. అయినప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్ అప్పటి నుండి దయాకర్‌పై కోపంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అందులో భాగంగానే అద్దంకి దయాకర్‌కు తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ రాకుండా, ఎమ్మెల్సీ పదవి రాకుండా, ఎంపీ టికెట్ రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీలో తమ ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించి అడ్డుపతున్నారని కాంగ్రెస్ వర్గా్ల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దయాకర్ ఎలాంటి పదవులు రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుపడుతున్నారని టాక్. ఈ క్రమంలో దయాకర్ నటించిన సినిమా ఆడియో ఫంక్షన్‌కు మంత్రి కోమటిరెడ్డి గెస్ట్‌గా వెళ్లడం.. అద్దంకి దయాకర్ ఆయన కాళ్లు మొక్కడంతో ఇక ‘వైరం ముగిసినట్లే’నా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి:

Tags:    

Similar News