బండి సంజయ్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్ కుమార్‌ను రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు.

Update: 2024-06-24 16:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్ కుమార్‌ను రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. ఢిల్లీలో నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయానికి వెళ్లిన కోమటిరెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్‌ను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సోమవారం పార్లమెంట్‌లో కరీంనగర్ లోక్ సభ సభ్యుడిగా బండి అచ్చ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు కలుసుకోవడం ఆసక్తిగా మారింది. 


Similar News