తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ

దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నేత రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) అన్నారు.

Update: 2024-09-16 11:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నేత రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) అన్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. సోమవారం తెలంగాణ సచివాలయం ఎదుట భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారని కొందరు అడుగుతున్నారు.. అసలు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు ఉందా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానేత అని కొనియాడారు. దేశంలో యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని గుర్తుచేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తల్లి(Telangana Talli) విగ్రహం పెట్టాలనే విషయం కేసీఆర్‌(KCR)కు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. డిసెంబర్ 9వ తేదీన ఇక్కడే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. రాబోయే పదేళ్లు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఒకటి అంటే తాము రెండు అంటామని.. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


Similar News