అమరుల త్యాగం ఎన్నటికీ మరవం: మంత్రి జగదీశ్ రెడ్డి
దిశ, సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
దిశ, సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి జెండావిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సమాన రీతిలో సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతును రాజును చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే అని వెల్లడించారు. నేడు దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారంటే దాని వెనుక ఎంతోమంది అమరుల త్యాగం ఉందని వారి త్యాగాలను ఎన్నటికీ మరువద్దన్నారు. నేటి యువత స్వాతంత్య్రోద్యమ త్యాగధనులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. అనంతరం జిల్లాలు కేటాయించిన నిధులు, అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను తెలిపారు.