జూ వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..
హైదరాబాద్ నెహ్రూ జూ లాజికల్ పార్కులో సందర్శకులకు మెరుగైన సదుపాయాలను కల్పించడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
దిశ, బహదూర్ పురా: హైదరాబాద్ నెహ్రూ జూ లాజికల్ పార్కులో సందర్శకులకు మెరుగైన సదుపాయాలను కల్పించడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం జూ పార్కులో కొత్తగా రూపొందించిన జూ వెబ్ సైట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెహ్రూ జూ లాజికల్ పార్క్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైదరాబాద్ వారి సహకారంతో ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సిస్టం, యానిమల్ అడాప్షన్ స్కీమ్ వివరాలు, జూ పార్క్ పూర్తి సమాచారాన్ని వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు తెలిపారు.
దీని ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా నేరుగా ఎంట్రీ టికెట్లు, బ్యాటరీ ఆపరేటర్ వెహికల్, సఫారీ పార్క్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్లు, జూ అధికారులు పాల్గొన్నారు.