సెంచరీ కొట్టి BRS మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం: మంత్రి హరీష్ రావు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి హరీష్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటోందని.. ఒకవేళ అధికారంలో వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటుందని విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి హరీష్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటోందని.. ఒకవేళ అధికారంలో వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటుందని విమర్శలు గుప్పించారు. బలమైన నాయకత్వంలో కావాలో.. బలహీన నాయకత్వం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఇక్కడ కేసీఆర్ ఉన్నారు.. అక్కడ ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ది అభివృద్ధి అజెండా.. కాంగ్రెస్‌ది బూతుల అజెండా అని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని రజినీకాంత్, సన్నీ డియోల్ వంటి యాక్టర్స్ మెచ్చుకుంటుంటే.. ఇక్కడ గజినీలకు మాత్రం కనబడటం లేదని సెటైర్ వేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ డకౌట్.. కాంగ్రెస్ రనౌట్ అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. సెంచరీ కొట్టి మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.