కొడుకును చూసి గర్వంగా ఫీల్ అవుతున్న మంత్రి హరీష్ రావు.. ఎమోషనల్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటారు.

Update: 2023-05-13 09:04 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటారు. అయినా నిత్యం సోషల్ మీడియాలో పలు ఇంట్రెస్టింగ్ పోస్టులను షేర్ చేస్తుంటారు. తాజాగా, ఆయన కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి పట్టా తీసుకున్న సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘మా అబ్బాయి ఆర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉంటాను. ఇది నీలోని పట్టుదలకు, మార్పు తీసుకురావాలన్న నీ ఆకాంక్షకు నిదర్శనం. తనలోని ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు. అచ్చూ.. ఈ ఘనమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా నీకు అభినందనలు. నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా కొడుకుతో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు.

Tags:    

Similar News