'ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగటానికి వస్తున్నారు'
2016లో నల్లగొండ జిల్లాలోని మర్రిగూడలో నాటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటించారని, పర్యటనలో భాగంగా మర్రిగూడలో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు
దిశ, తెలంగాణ బ్యూరో: 2016లో నల్లగొండ జిల్లాలోని మర్రిగూడలో నాటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటించారని, పర్యటనలో భాగంగా మర్రిగూడలో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని నడ్డా హామీ ఇచ్చారని మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. హామీ ఇచ్చి ఆరేళ్లైనా అమలుకు నోచుకోలేదని ఎద్దేవా చేశారు. ఈ సెంటర్ ఏర్పాటు కోసం చౌటుప్పల్‌లో 8.2 ఎకరాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్‌కు నయా పైసా ఇవ్వలేదని, మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని కూడా నడ్డా హామీ ఇచ్చారని ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్దపు హమీలిస్తూ, ప్రజాగోడు పట్టని బీజేపీ నేతలు ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ది చెప్పడం ఖాయమని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
మీ హమీలు ఏమయ్యాయి @JPNadda ji..?
— Harish Rao Thanneeru (@trsharish) October 20, 2022
2016లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, మీరు పర్యటిస్తూ, ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తమన్నరు.
మీరు హమీ ఇచ్చి ఆరేళ్లయింది. ఈ సెంటర్ ఏర్పాటు కోసం 8.2 ఎకరాల స్థలం చౌటుప్పల్ లో తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది 1/2 pic.twitter.com/6tZ1pxEWtl