తనతో నాకు ఎటువంటి సంబంధం లేదు: Minister Gangula kamalakar

ఫేక్ ఐపీఎస్ శ్రీనివాస్ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కోవడంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.

Update: 2022-12-04 12:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఫేక్ ఐపీఎస్ శ్రీనివాస్ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కోవడంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఐపీఎస్ అధికారిగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన శ్రీనివాస్ పేరు చాలాసార్లు విన్నానని అన్నారు. అతడు మున్నూరు కాపు అని తెలిసి ఓ సారి కలిసానని అన్నారు. ఆ రోజు అతనితో ఓ ఫోటో దిగానని.. ఆ ఫోటోనే ఇప్పుడు సీబీఐ విచారణకు కారణమయ్యిందని అన్నారు. ఆ రోజు, మరుసటి రోజు గంట సేపు మామూలుగా మాట్లాడింది తప్ప అంతకు మించి ఏమీ లేదన్నారు. కాపు సంఘంలో తిరిగే వాడని, ధర్మేందర్‌ అనే వ్యక్తి చెప్తే కలిసేందుకు అతను ఉన్న స్థలంలోకి వెళ్లి పరిచయం చేసుకున్నట్లు చెప్పారు. మున్నూరు కాపు కులంలో ఐపీఎస్ కదా అని గర్వంగా ఫీల్ అయ్యామని, అతని భార్య కూడా ఐఏఎస్‌ అన్నారు కదా ఆమెను కూడా కాలవాలని చెప్పానన్నారు. కానీ, ఇప్పటి వరకు శ్రీనివాస్‌ ఎలాంటి పనులు అడుగలేదన్నారు.

తనతో అతడికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి గంగుల స్పష్టం చేశారు. మా బావ ఎంపీ వద్ధిరాజు రవిచంద్రకు అతను పరిచయం అని, శ్రీనివాస్‌ ఇంట్లో పెళ్లికి బావను సహాయం చేయమని అడిగారని తెలిసిందన్నారు. హైదరాబాద్‌లో తనకెవరు తెలియదని చెప్పి క్రెడిట్ ఇప్పివ్వాలని శ్రీనివాస్ షూరిటీ కోరినట్లు తెలిపారు. దీంతో, రవిచంద్ర రూ.15లక్షల విలువ చేతి బదులు ఇప్పించాడని, ఇదే విషయాన్ని విచారణ సమయంలో సీబీఐ అధికారులకు చెప్పినట్లు వివరించారు. ఇంకా ఇచ్చిన డబ్బులు కూడా అతని దగ్గరే ఉన్నాయని, మాకు ఏ పని ఉన్నా అధికారులతో నేరుగా మాట్లాడుతామని, మధ్యవర్తులతో మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. శ్రీనివాస్‌తో కానీ, మరెవరితో కానీ లావాదేవీలు జరుపలేదని స్పష్టం చేశారు. మరోవైపు, నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ పై ఇన్‌ట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైజాగ్‌లో సీబీఐ కాలనీలో ఉండేవాడని అందుకే సీబీఐ శ్రీను అని పిలుస్తారని తెలుసన్నారు. ఇక అందరూ అలా పిలువడంతో..అతను కూడా సీబీఐ అని చెప్పుకున్నాడని..కానీ, అతడు అందరి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారనే విషయాలు మాత్రం తనకు తెలీదని గంగుల చెప్పారు. అతను కేవలం కులంలో గొప్పలు చెప్పుకొని తిరిగాడని, శ్రీనివాస్‌ అనే వ్యక్తి సీబీఐ అని చెప్పి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని విచారణలో స్పష్టమైందని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News