రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్: మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

తనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దాయాకర్ రావు శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్ అని ఆరోపించారు.

Update: 2023-02-17 08:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దాయాకర్ రావు శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్ అని ఆరోపించారు. ఆయన ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పని చేస్తుంటే.. తాను తెలంగాణ కోసం చంద్రబాబుతో మొదటగా లేఖ ఇప్పించానన్నారు. తనకు చదువు రాదని విమర్శిస్తున్నారు. మీలా నేను ఉన్నత చదువులు చదవలేకపోయినా ప్రజల మనోభావాలను చదివానని.. వారి ఆదరాభిమానాలను పొంది ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినయ్యాన్నారు.

పాదయాత్ర పేరుతో రేవంత్ రెడ్డి కార్లలో తిరుగుతున్నారని విమర్శించారు. తన గురించి కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని ఫైర్ అయ్యారు. తనపై చేసిన భూకబ్జా ఆరోపణలను రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలు తుపాకీ వెంకటి రామునిలా ఉన్నాయని సెటైర్లు వేశారు. మరో వైపు షర్మిలపై కూడా ఎర్రబెల్లి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. షర్మిల పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి, షర్మిల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Tags:    

Similar News