టీడీపీ ఆఫీస్ ప్రారంభించుకోబోతున్నామంటూ... మంత్రి ఎర్రబెల్లి మళ్లీ టంగ్ స్లిప్ (వీడియో)
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కాలేజ్....Minister Errabelli Dayaker rao Tongue Slip
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కాలేజ్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ప్రారంభానికి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అధికారులు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిలు వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. జిల్లా పెద్దగా కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కాలేజ్ తోపాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంను ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. దీంతో పక్కనే ఉన్న మరో మంత్రి సత్యవతి రాథోడ్ టీడీపీ కాదు, టీఆర్ఎస్ కార్యాలయం అని చెప్పిండి అని చెప్పడంతో...స్పందించిన మంత్రి సారీ.. సారీ టీఆర్ఎస్ కార్యాలయం అని సర్ధి చెప్పాడు. అక్కడ ఉన్నవారు... దయాకర్ రావు మళ్ళీ యూ టర్న్ తీసుకుంటున్నాడా..ఏందీ అని చమత్కరించారు.