రేవంత్, బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-02-23 11:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం భూపాలపల్లిలో బీఆర్ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో పాల్గొన్న ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని విమర్శించారు. రూ.500 కోట్లతో ఇళ్లు ఎలా కట్టాడో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వర్గమంతా జైలు నుంచి వచ్చిన వాళ్లే అని వ్యాఖ్యానించారు. అంతేగాక, తెలంగాణలో రెండు పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయని రేవంత్, బండి సంజయ్‌ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లిద్దరిని రాష్ట్రం దాటేవరకు తరిమి కొట్టాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

జిల్లాలో కేటీఆర్ సుడిగాలి పర్యటన

అంతకుముందు భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ భవనాలను కేటీఆర్‌ ప్రారంభించారు. గురుకుల పాఠశాల, బీఆర్‌ఎస్‌ కార్యాలయం, డబుల్ బెడ్ రూమ్ క్వార్టర్ల సముదాయం, రూ.కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించిన గణపురం తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన చారి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, సింగరేణి సీఎండీ శ్రీధర్, డైరెక్టర్లు బలరాం ఎన్వీ కే శ్రీనివాస్, వెంకటేశ్వర రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు. పాల్గొన్నారు.

Tags:    

Similar News