రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్ మెయిలర్: మంత్రి ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని చేయడమే టీ- కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ముప్పు అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమే అని ఘాటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఒక ఐటమ్ లాగా చూస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్ మెయిలర్ అని తీవ్ర విమర్శలు చేశారు. ప్రగతి భవన్‌ను డైనమైట్లతో పేల్చేయాలన్న రేవంత్ వ్యాఖ్యలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, మంగళవారం హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ములుగులో ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు ఎంట్రీ లేని ప్రగతి భవన్ ఎందుకని.. దానిని నక్సలైట్లు డైనమైట్లు పెట్టి పేల్చాయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపడంతో బీఆర్ఎస్ నేతలు రేవంత్‌పై మండిపడుతున్నారు.