దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఒక వ్యవసాయ రాష్ట్రమని, అనతికాలంలోనే తెలంగాణ వ్యవసాయంలో అగ్రగామిగా ఎదిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు సమితిలు, రైతు నాయకులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దురదృష్టవశాత్తు దేశంలో ఒక గుడ్డి ప్రభుత్వం ఉన్నదని, వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తున్నదని తెలిపారు. ఈ విషయం ముందే గ్రహించి రాష్ట్ర రైతాంగాన్ని జాగృతం చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ విజ్ఞప్తిని గమనించి రైతులు వరి సాగును ఆపేశారని చెప్పారు. 12,600 తెలంగాణ గ్రామ పంచాయతీలు తెలంగాణ ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖలు పంపాయని, ఇంతచేసినా కేంద్రం ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్నదని స్పష్టం చేశారు.
కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతాంగ అనుకూల ప్రభుత్వం కోసం తెలంగాణ రైతులు బాటవేయాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దేశ రైతాంగాన్ని జాగృతం చేయాలని పిలుపునిచ్చారు.