పార్లమెంట్ ఎన్నికల వేళ మెగాస్టార్ చిరంజీవి కీలక సందేశం

పార్లమెంట్ ఎన్నికల వేళ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి, తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు.

Update: 2024-03-12 15:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి, తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ఇందుకోసం మెగాస్టార్ తన ట్విట్టర్ ఖాతాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్‌కు రీ ట్వీట్‌గా.." మన దేశ 18 వ లోక్ సభ ఎలక్షన్లు త్వరలో జరుగుతున్నాయి. మీకు 18 సంవత్సరాల వయస్సు వస్తే మీరు మొట్టమొదటిసారి ఓటు వేసే హక్కు పొందుతారు. మీ మొదటి ఓటు మన రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం వినియోగించండి. తప్పనిసరిగా ఓటు వేయండి అని చిరంజీవి రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ కు త్వరలో కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందని గతంలో ఉహాగానాలు రాగా.. తాజాగా ఆయన ప్రధాని మోడీ ట్వీట్ కు రిప్లై ఇవ్వడం తో మరోసారి అలాంటి చర్చకు దారి తీసింది.


Similar News