ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మెగా హెల్త్ క్యాంపులు

వరద ప్రభావిత ఏరియాలపై వైద్యారోగ్యశాఖ ఫోకస్ పెట్టింది. అత్యధిక ప్రభావానికి గురైన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మెగా హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Update: 2024-09-03 03:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వరద ప్రభావిత ఏరియాలపై వైద్యారోగ్యశాఖ ఫోకస్ పెట్టింది. అత్యధిక ప్రభావానికి గురైన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మెగా హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 24 గంటల పాటు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు క్షేత్రస్థాయిలో వరద ప్రాంతాల్లో మొబైల్ టీమ్స్ బాధితుల ఆరోగ్య పరిస్థితులపై మానిటరింగ్ చేస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే పునరావాస ప్రాంతాల్లోకి చేరగా, అక్కడే ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు ఉన్నోళ్లతో పాటు అనుమానితులందరికీ టెస్టులు చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. సీజనల్ వ్యాధులు, అంటు రోగాలు ప్రబలకుండా ముందస్తు ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నామని డాక్టర్లు చెప్పారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల చుట్టూ బ్లీచింగ్‌తో పాటు ఆ సమీపంలోని నాలాలు, నీటి గుంటల్లో యాంటీ లార్వా ఆపరేషన్ లో భాగంగా ఆయిల్ బాల్స్ వేశామని ఓ అధికారి చెప్పారు. వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని వివరించారు. మరో పది రోజుల పాటు కంటిన్యూ గా హెల్త్ క్యాంపులు కొనసాగుతాయని పబ్లిక్ హెల్త్ అధికారులు ప్రకటించారు.


Similar News