Medico Preethi బ్రేకింగ్: మెడికో ప్రీతిపై హత్యాయత్నం..? సంచలన వ్యాఖ్యలు చేసిన తండ్రి నరేందర్

మెడికో ప్రీతి తండ్రి నరేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ప్రీతి ఆత్మహత్యయత్నం చేసుకునేంత పిరికిది కాదని.. మాతో మాట్లాడిన తర్వాతే ప్రీతిపై హత్యయత్నం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Update: 2023-02-26 04:52 GMT
Medico Preethi  బ్రేకింగ్: మెడికో ప్రీతిపై హత్యాయత్నం..? సంచలన వ్యాఖ్యలు చేసిన తండ్రి నరేందర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మెడికో ప్రీతి తండ్రి నరేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ప్రీతి ఆత్మహత్యయత్నం చేసుకునేంత పిరికిది కాదని.. మాతో మాట్లాడిన తర్వాతే ప్రీతిపై హత్యయత్నం జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఫోన్‌లో మాతో మాట్లాడేటప్పుడు కూడా.. తనను ఏదో చేస్తారనే అనుమానం ఉందని ప్రీతి చెప్పిందని తెలిపారు. తమకు కచ్చితంగా న్యాయం జరగాలని ప్రీతి తండ్రి డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా.. ఆత్మహత్యయత్నానికి ముందు సీనియర్ సైఫ్ అరాచకాలను ప్రీతి ఫోన్‌లో తన తల్లితో చెప్పిన ఆడియో బయటకొచ్చింది. సైఫ్ వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని.. అతడు చాలా మందిని ఇలానే బాధపెడుతున్నాడని తల్లి వద్ద ప్రీతి ఆవేదన వ్యక్తం చేసింది. సైఫ్‌కు నాన్న పోలీసులతో ఫోన్ చేయించిన లాభం లేకుండా పోయిందని.. అతడిపై ఫిర్యాదు చేస్తే కాలేజ్‌లో సీనియర్లు తనను దూరం పెడతారని పేర్కొంది.

అంతేకాకుండా సైఫ్ బ్యాచ్ ప్రవర్తన ఎలా ఉంటుందో తల్లితో చెప్పుకుని బాధపడింది. వీరి వల్ల చదువుకోవాలంటేనే భయమేస్తోందని ప్రీతి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక, వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజ్‌కు చెందిన ప్రీతి సీనియర్ సైఫ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. 

Tags:    

Similar News