డీహెచ్‌ రవీందర్ నాయక్‌పై మెడికల్ జేఏసీ ఫిర్యాదు

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్‌ రవీందర్ నాయక్‌పై తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్‌, రిటైర్డ్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పగిడిపాటి సుధాకర్ సీఎం ప్రత్యేకాధికారి శేషాద్రికి ఫిర్యాదు చేశారు.

Update: 2024-10-25 16:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్‌ రవీందర్ నాయక్‌పై తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్‌, రిటైర్డ్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పగిడిపాటి సుధాకర్ సీఎం ప్రత్యేకాధికారి శేషాద్రికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయా వివరాలను శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. భువనగిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ యశోద చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదు చేశానని, ఆ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని తెలుసుకునేందుకు డాక్టర్‌ రవీందర్‌ నాయక్‌ వద్దకు వెళ్లానని తెలిపారు. అక్రమాలపై తగిన వివరాలతో జిరాక్స్‌ కాపీలు ఇచ్చేందుకు ఆయన చాంబర్‌ లోపలికి వెళితే.. ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని పేర్కొన్నారు. తాను 25 ఏళ్లు వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో పని చేశానని, డీఎంహెచ్‌వోగా రిటైర్‌ అయ్యాయని సుధాకర్‌ తెలిపారు. డాక్టర్స్‌ అసోసియేషన్లలో వివిధ హోదాల్లో‌నూ పని చేశానని అన్నారు. తన సర్వీసులో ఇలాంటి ప్రవర్తన కలిగిన అధికారిని ఏనాడు చూడలేదని తెలిపారు. డాక్టర్‌ రవీందర్‌ నాయక్‌ తన విధులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ సుధాకర్‌ ప్రభుత్వానికి విజ్క్షప్తి చేశారు.


Similar News