కార్మికులు ఆరోగ్య నియమాలు పాటిస్తూ విధులకు హాజరు కావాలి.. జోనల్ కమిషనర్
కార్మికులు ఆరోగ్య నియమాలు పాటిస్తున్న విధులకు హాజరు కావాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ అన్నారు.
దిశ, కూకట్పల్లి : కార్మికులు ఆరోగ్య నియమాలు పాటిస్తున్న విధులకు హాజరు కావాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ అన్నారు. స్వచ్చతా హి సేవ 2024 కార్యక్రమంలో భాగంగా సోమవారం కూకట్‌పల్లిలో పారిశుధ్య కార్మికుల కోసం నిర్వహించిన స్వచ్చ శిబిర్ వైద్య శిబిరం, పోషక ఆహారం పై అవగాహన కార్యక్రమాన్ని జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ స్వచ్చ కార్మికులు అందరు ఆరోగ్య నియమాలు పాటించాలని, అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈఎస్ఐ ఆసుపత్రిని వినియోగించుకుని ఆరు నెలలకు ఒక సారి తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. బీపీ, షుగర్ ఉన్నట్లయితే క్రమం తప్పకుండా మందులు వాడాలని కోరారు.
అనంతరం ఎన్ఐఎన్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) హైదరాబాద్ వైద్యులు డాక్టర్ రాజేందర్ కుమార్, డాక్టర్ ఫెర్నాండెజ్‌లు మాట్లాడుతూ కార్మికులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషక ఆహార ప్రాముఖ్యత అవసరమని అన్నారు. కార్మికులు ఆకు కూరలు, కూరగాయలు, సీజనల్ పండ్లు ఎక్కువగా తీసుకోవాలని, దాని ద్వారా పోషక ఆహార లోపలు లేకుండా ఉంటుందని, వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని అన్నారు. అనంతరం కార్మికులకు ఈఎస్ఐ వైద్యులు బీపీ, షుగర్ వ్యాధులకు సంబంధించిన వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీ కృష్ణయ్య, డీఈఈ, పారిశుధ్య విభాగం అధికారి శ్రీనివాస్ రావు, డీసీ ఎస్డబ్ల్యూఎం ఉదయ్, ఎస్ఎస్ మనోహర్ రెడ్డి, ఈఎస్ఐ వైద్యులు డాక్టర్ గోపిక, డాక్టర్ శిబియ, డాక్టర్ అజిత, ఎస్ఆర్పీ సత్యరాయణ, సుబ్బారావు, చైతన్య, ఎస్ఎఫ్ఏలు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.